![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -360 లో... పోలీసులతో జ్యోత్స్న, గౌతమ్ ఇద్దరిపై డౌట్ ఉందని ఇంకొకరిని కనిపెట్టాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంట్లోకి వచ్చాక వాళ్ళని జ్యోత్స్న దగ్గరికి వెళ్లకని చెప్పండి. త్వరగా రెండు కుటుంబాలు కలవాలని అనుకుంటే ఇంకా దూరం అవుతున్నారని దీప అంటుంది. ఇప్పుడు ఏమైనా కలిసి ఉన్నాయా విడిపోవడానికి అని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత పోలీసులు శివన్నారాయణ ఇంటికి వెళ్లి కార్తీక్ ఇంట్లో కత్తి దొరికింది. జ్యోత్స్న, గౌతమ్ పై డౌట్ ఉందని చెప్పాడు అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇలా చీటికీ మాటికీ వచ్చి మా ఇంటి ఆడపిల్ల పరువు తియ్యకండని సుమిత్ర అంటుంది. బుల్లెట్ మిస్ అయిన కేసులో కూడా జ్యోత్స్న విచారణకి రావల్సి ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. కత్తిపై వేలిముద్రలు ఎవరివో తెలిస్తే అప్పుడు తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ చెప్పి వెళ్తాడు. అందరు కార్తీక్ పై కోపంగా ఉంటారు. ఎవరు నేరస్తులో తెలుస్తుంది కదా.. అప్పుడు తెలుస్తుందని దశరథ్ అంటాడు.
ఆ తర్వాత అనసూయని శౌర్య ఆటపట్టిస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. కార్తీక్ దగ్గరికి స్వీట్ బాక్స్ తో ఎంట్రీ ఇస్తాడు సత్యరాజ్. బెస్ట్ రెస్టారెంట్ అవార్డు మన రెస్టారెంట్ కి వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్తాడు. కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మా తాత ముందు నిలబడి నేను గెలిచానని చెప్తానని కార్తీక్ గర్వంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |